చరిత్ర సృష్టించిన హరియాణా జట్టు.. మొదటిసారి?

praveen
ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ అటు క్రికెట్ ని అమితంగా అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉంటారు క్రీడాభిమానులు. ఇక క్రికెట్కు ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టే ఇటీవల కాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు క్రికెట్ వైపు అడుగులు వేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా క్రికెట్ నే ప్యాషన్ గా మార్చుకునీ ముందుకు సాగే ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాలించడం లాంటివి చేస్తుంటారు.


 ఇక అటు బీసీసీఐ కూడా యంగ్ క్రికెటర్లకు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఎన్నో దేశవాలి టోర్నీలను నిర్వహిస్తూ  ఉంటుంది. అలాంటి వారిలో ప్రతిష్టాత్మకమైన విజయ్ హజారే ట్రోఫీ కూడా ఒకటి అని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి కూడా విజయ్ హజారే ట్రోఫీ రసవతరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే కుర్రాళ్ళు అందరూ కూడా ఇక ఈ టోర్నీలో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ తమ ఆట తీరుతో వార్తల్లో నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రోజులపాటు ప్రాతినిధ్యం వహించి  ప్రస్తుతం జట్టులో చోటు కోల్పోయిన ఆటగాళ్ళు సైతం విజయ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు.


 ఇక ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన విజయ్ హాజారే ట్రోఫీ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈనెల 16వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లలో హర్యానా జట్టు సంచలనమే సృష్టించింది. ఏకంగా 30 ఏళ్ల విజయ హజారే ట్రోఫీ చరిత్రలో తొలిసారి హర్యానా జట్టు ఫైనల్ కు చేరుకుంది అని చెప్పాలి. రాజ్కోట్ లో జరిగిన సెమీఫైనల్ లో తమిళనాడు పై గెలిచి ఫైనల్ కు దూసుకువెల్లింది. ఇక గ్రూప్ స్టేజిలోనూ ఈ జట్టు అన్ని మ్యాచ్లలో గెలవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: