ఐపీఎల్ వేలంలో.. అతను హాట్ కేకులా మారతాడు : మంజ్రేకర్
అయితే తమ జట్టులోకి ఏ ఆటగాడిని తీసుకోవాలి అనే విషయంపై ఇక ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు కూడా పక్కా ప్రాణాలికలు సిద్ధం చేసుకున్నాయ్. దీంతో ఇక వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి జట్టుకు విజయాన్ని అందించే ఆటగాడిని టీం లోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పాలి. అయితే ఈసారి వేలంలో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న పాట్ కమిన్స్ దాదాపు మూడేళ్ల తర్వాత ఐపీఎల్లో పాల్గొంటూ ఉన్నాడు అని చెప్పాలి. దీంతో అతన్ని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది.
ఇక ఇదే విషయం పై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డిసెంబర్ 19వ తేదీన జరగబోయే ఐపీఎల్ వేలం లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ హాట్ కేకులా మారి పోతాడు అంటూ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కమిన్స్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. పిచ్ పరిస్థితిలకు తగ్గట్లు బౌలింగ్ చేసే సత్తా అతనికి ఉంది. ఇక అతను వేలంలో ఒక ఎక్స్ ఫాక్టర్ గా మారతాడు. కమిన్స్ కోసం పంజాబ్, హైదరాబాద్ ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశాలు ఉన్నాయి. అతడిని కెప్టెన్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.