దారుణం : పిల్లల్ని చంపి వండుకొని తిన్నాడు?
ఎందుకంటే సాటి మనుషుల విషయంలో జాలీ దయతో మెలగాల్సిన మనుషులు ఏకంగా ఉన్మాదులుగా మారిపోతూ దారుణాలకు పాల్పడుతున్నారు. అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ సభ్య సమాజం మొత్తం ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నారు. ఏకంగా చాక్లెట్ తిన్నంత ఈజీగా మనుషుల ప్రాణాలను తీసేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత అమానవీయమైనది. ఏకంగా ఇక్కడ ఒక వ్యక్తి అభం శుభం తెలియని పిల్లలను అత్యంత దారుణంగా చంపేశాడు. అంతేకాదు వారి శరీర భాగాలను ముక్కలుగా కోసి వండుకొని తిన్నాడు.
ఈ ఘటన ఎక్కడో కాదు.. భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. పంజాబ్ ప్రావిన్స్ లోని ముజఫర్ ఘర్ లో ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేశాడు ఒక వ్యక్తి. అందులో అబ్దుల్లా అనే మూడేళ్ల బాలుడు హబ్స అనే రెండేళ్ల చిన్నారిని చంపి వండుకుని తిన్నాడు. ఆపై మిగిలిన మాంసాన్ని సమీపంలోని దర్గాల్లో పంచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే కిడ్నాప్ అయినా మరో బాలుడు ఏడేళ్ల అలీనీ కాపాడారు పోలీసులు. కాగా నిందితుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అన్న విషయాన్ని పోలీసులు తెలిపారు.