2023 ఏడాది.. రోహిత్ కు అస్సలు కలిసి రాలేదే?

praveen
తన కెప్టెన్సీలో ఏకంగా ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్ గా నిలపడంలో సక్సెస్ అయ్యాడు రోహిత్ శర్మ. ఎవరికి సాధ్యంకానీ రీతిలో అతి తక్కువ సమయంలోనే ముంబై జట్టుకు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించాడు అన్న విషయం తెలిసిందే. అలాంటి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇటీవల ముంబై ఇండియన్స్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఏకంగా అతన్ని జట్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.


 ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చేతికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది అని చెప్పాలి. ఇక ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయంతో  అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. రోహిత్ లాంటి కెప్టెన్ అన్ని టీమ్స్ కావాలని కోరుకుంటే అటు ముంబై ఇండియన్స్ మాత్రం అతని పక్కన పెట్టడం ఏంటి అని అందరూ షాక్ లో మునిగిపోతున్నారు. అయితే ఇంత జరుగుతున్న అటు రోహిత్ శర్మ మాత్రం ఈ విషయంపై స్పందించకపోవడం మౌనంగా ఉండడం మాత్రం అందరిని మరింత షాక్ కి గురిచేస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఇక రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించిన నేపథ్యంలో హిట్ మ్యాన్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.


 కెప్టెన్ రోహిత్ శర్మకు 2023 ఏడాది అస్సలు కలిసి రాలేదు అంటూ ఎంతో మంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఐపీఎల్ 2023 సీజన్ ట్రోఫీ గెలవలేకపోయాడు రోహిత్ శర్మ. ఇక చెత్త ప్రదర్శనతో ముంబై నిరాశపరిచింది. ఇక అతనికి కెప్టెన్సీ లోనే ఇండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టుకు ఓటమి ఎదురైంది. ఇక ఇటీవల వన్డే వరల్డ్ కప్ లోను రోహిత్ టైటిల్ అందించలేకపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తొలగింపు.. ఇవన్నీ చూస్తే 2023 ఏడాది రోహిత్ కు అసలు కలిసి రాలేదని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: