ధోనికి ఉన్న గౌరవం.. రోహిత్ కు లేకుండా పోయిందే?
అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మహేంద్ర సింగ్ ధోని ఐపిఎల్ ప్రారంభమైన నాటి నుంచి కూడా కెప్టెన్ గా ముందుకు నడిపిస్తూ ఉంటే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను మధ్యలో అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతను కెప్టెన్సీ చేపట్టిన తర్వాతే ముంబై ఇండియన్స్ అతి తక్కువ సమయంలోనే ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది అని చెప్పాలి. అయితే ఇక ధోని మీద ఉన్న గౌరవంతో అతను రిటైర్మెంట్ ప్రకటించేంతవరకు కూడా అతనే మాకు కెప్టెన్ అని గౌరవం ఇస్తూ.. చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ నియమించే సాహసం చేయడం లేదు. అయితే ఇటీవలే ముంబై ఇండియన్స్ మాత్రం రోహిత్ శర్మ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ఎందుకంటే ధోని లాగే ఐదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మకు కనీస గౌరవం ఇవ్వలేదు ముంబై ఇండియన్స్. ఏకంగా అతను రిటైర్మెంట్ ప్రకటించక ముందే కెప్టెన్ గా తప్పించి ఒక సాధారణ ఆటగాడిగా మార్చేసింది. వయసులో కూడా ధోని కంటే రోహిత్ చిన్నవాడని.. మరో మూడు నాలుగు ఏళ్ళు అతనికి కెప్టెన్సీ వహించే సత్తా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ధోనికి చెన్నై ఇచ్చిన గౌరవం ముంబై ఎందుకు రోహిత్ కి ఇవ్వలేకపోయింది అంటూ ప్రశ్నిస్తున్నారు.