మార్పు ఊహించిందే.. కానీ ఇంత తొందరగానా?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా ఒకే విషయం గురించి చర్చ జరుగుతుంది. అదే ఐపీఎల్లో ఛాంపియన్ టీమైన ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను సారధ్య బాధ్యతలు నుంచి తప్పించడం గురించి. ఇక ఈ విషయం గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం తో ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగి పోతున్నారు అని చెప్పాలి.

 భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చ జరుగుతుంది. అయితే అప్పుడు వరకు ఎంతో మంది లెజెండరీ క్రికెటర్స్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ చేపట్టి టైటిల్ అందించేందుకు ప్రయత్నించిన అది సాధ్యం కాలేదు. కానీ రోహిత్ శర్మ చేతికి కెప్టెన్సీ పగ్గాలు వచ్చాయో లేదో అతి తక్కువ సమయం లోనే ఐదుసార్లు టైటిల్ ఎగరేసుకు పోయింది ముంబై ఇండియన్స్. దీంతో ఐపీఎల్ హిస్టరీ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా ఛాంపియన్ జట్టుగా అవతరించింది అని చెప్పాలి. ముంబై ఇండియన్స్ అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా ప్రస్తుతం ప్రస్థానం కొనసాగుతోంది.

 ఇలా ముంబై ఇండియన్స్ ఛాంపియన్ టీం గా ఎదగడానికి కారణమైన రోహిత్ శర్మను ఇప్పుడు జట్టు యాజమాన్యం పక్కన పెట్టింది. అయితే ఇటీవల హార్దిక్ పాండ్యాను జట్టు లోకి తీసుకుంది యాజమాన్యం. ఇక అతని టీంలోకి తీసుకున్నప్పుడే రోహిత్ తర్వాత అతనే కెప్టెన్ అని అందరూ ఊహించారు. గుజరాత్ కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అయిన హార్దిక్ కు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించగానే సారధ్య బాధ్యతలు దక్కుతాయని అనుకున్నారు. అయితే ఇలా కెప్టెన్సీ మార్పు ఊహించిందే. కానీ ఇంత సడన్గా మార్పు చూడాల్సి వస్తుందని ఎవరు అనుకోలేదు. కెప్టెన్సీ మార్పును రోహిత్ ఫ్యాన్స్  అయితే అసలు జీర్ణించు కోలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: