హార్దిక్ కు కెప్టెన్సీ.. రోహిత్ ఒప్పుకున్నాడా?

praveen
ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ టీఎంగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఇటీవల కెప్టెన్సీ విషయంలో తీసుకున్న నిర్ణయం అందరిని అవాక్కయ్యేలా చేసింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరుగాంచిన రోహిత్ శర్మను కాదని స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది ముంబై ఇండియన్స్  యాజమాన్యం.. దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. రోహిత్ అంత సక్సెస్ అయిన తర్వాత కూడా అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించాల్సిన అవసరం ఏముంది అని అందరూ సోషల్ మీడియా వేదికగా ముంబై ఫ్రాంచైజీని  ప్రశ్నిస్తున్నారు.

 అయితే ఈ నిర్ణయంతో అటు రోహిత్ ఫ్యాన్స్ అందరూ కూడా ముంబైకి ఇక నుంచి మద్దతు పలకబోము అంటూ ఇక సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చ జరుగుతుంది. అయితే ఇంత జరుగుతున్న అటు రోహిత్ శర్మ మాత్రం ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. దీంతో రోహిత్ కి కెప్టెన్సీ మార్పు ముందే తెలుసా లేకపోతే ఎందుకు స్పందించడం అని కోరుకున్నాడు అనే విషయం అర్థం కాక అభిమానులు కూడా కన్ఫ్యూజన్లో మునిగిపోయారు.

 అయితే 2024 ఐపీఎల్ సీజన్ కోసం అటు గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ లోకి తీసుకుంది జట్టు యాజమాన్యం. అయితే ఇలా సంప్రదింపులు జరిపిన సమయంలో కెప్టెన్సీ చాన్స్ ఇస్తేనే జట్టులోకి వస్తానని ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి పాండ్య షరతు పెట్టినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇక ఈ విషయాన్ని ప్రపంచ కప్ సమయంలోనే రోహిత్ దృష్టికి కూడా ముంబై యాజమాన్యం తీసుకెళ్లిందట. కెప్టెన్సీ మార్పుపై పలు దపాలుగా చర్చలు జరిగాయట. ఇక ఆ సమయంలోనే హార్దిక్ కెప్టెన్సీకి రోహిత్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: