నాకు ఓపెనర్ గా రావడంపై.. పెద్దగా ఇంట్రెస్ట్ లేదు : మిచెల్ మార్ష్

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ తో టెస్టు సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా అద్భుతంగా రాణిస్తుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్  ఒక లెజెండరీ క్రికెటర్ కు చివరి సిరీస్ కావడం గమనార్హం. అతను ఎవరో కాదు డేవిడ్ వార్నర్. ఎన్నో ఏళ్ల నుంచి ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్ గా కొనసాగుతూ.. ఎన్నో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు డేవిడ్ వార్నర్. ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గర అయ్యాడు అన్న విషయం తెలిసిందే. కేవలం టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే కాదు మూడు ఫార్మాట్లకు కూడా ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్ గా ఉన్నాడు.

 అయితే ఇక ఇప్పుడు తన సుదీర్ఘమైన టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధమయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతాను అంటూ అధికారికంగా ప్రకటించాడు. దీంతో ఇక డేవిడ్ వార్నర్ ఓపెనర్ కావడంతో ఈ అతను రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆస్ట్రేలియా జట్టుకు టెస్టుల్లో ఓపెనర్ గా ఎవరు బరిలోకి దిగుతారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఇక డేవిడ్ వార్నర్ ఓపెనర్ స్థానాన్ని దక్కించుకుంటాడు అంటూ ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ఇక ఇదే విషయంపై మిచెల్ మార్ష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్తో టెస్ట్ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ వార్నర్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. తాను ఓపెనర్ గా వస్తానేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ తనకు ఓపెనర్ గా రావడం పై ఆసక్తి లేదు అంటూ మిచెల్ మార్ష్ షాక్ ఇచ్చాడు  తాను రెగ్యులర్గా బ్యాటింగ్ చేసి ఆరవ స్థానంలోనే ఆడాలని అనుకుంటున్నాను అంటూ తెలిపాడు. అలా అయితేనే నాకు నచ్చిన విధంగా నేను బాటింగ్ చేయగలను అంటూ మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: