బిగ్ బాస్ షోతో.. పల్లవి ప్రశాంత్ రూ. కోటి వరకు సంపాదించాడా?
బిగ్ బాస్ హౌస్ లో ఎంతోమంది ఎదురు దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన.. అతను మాత్రం తన ఆట తీరును.. తన వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఒకే విధంగా ఉంటూ ప్రేక్షకులను ఫిదా చేశాడు. దీంతో బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ ఓటింగ్ మొత్తం వన్ సైడ్ గా మారిపోయింది. పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ విన్నర్ అని కొన్ని రోజుల ముందు నుంచి ఓటింగ్స్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరగగా.. అందరూ ఊహించినట్లుగానే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.
ఇలా ఒక కామన్ మ్యాన్ బిగ్బాస్ విన్నర్ గా నిలవడంతో అందరూ ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. అయితే ఇక టైటిల్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కి దక్కిన బెనిఫిట్స్ ఏంటి అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు చూసుకుంటే.. ప్రశాంత్ కి ప్రైజ్ మనీగా 35 లక్షల రూపాయలు దక్కాయి. 15 లక్షలు టాప్ ఫోర్ గా ఉన్న యావర్ తీసుకోవడంతో ఇక అతనికి 50 లక్షల ప్రైస్ మనీ లో కేవలం 35 లక్షల మాత్రమే వచ్చాయి. అంతేకాకుండా 15 లక్షల విలువైన ఒక డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకున్నాడు. 15 లక్షల విలువ చేసే కారును కూడా ప్రైజ్ మనీగా అందుకున్నాడు. ఇక అతనీ రెమ్యూనరేషన్ కూడా లక్షల్లోనే ఉండనుంది అని చెప్పాలి. ఓవరాల్ గా బిగ్ బాస్ ద్వారా పల్లవి ప్రశాంత్ కోటి రూపాయలు విలువైన సొత్తును సొంతం చేసుకున్నాడు అన్నది తెలుస్తోంది.