పాపం సన్రైజర్స్.. వద్దనుకున్న ఆటగాడే దంచి కొట్టాడు?

praveen
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి గత కొంతకాలం నుంచి అదృష్టం అసలు కలిసి రావడం లేదు. టైటిల్ వేటలో అంతకంతకు వెనుకబడిపోతుంది ఈ జట్టు. అయితే ప్రతి ఏడాది టైటిల్ గెలవడం కోసం జట్టులో ఉన్న ఎంతోమంది ఆటగాళ్లను మార్పు చేస్తూనే ఉంది. ఇక మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను భారీ ధర పెట్టి మరి కొనుగోలు చేసింది. అయినప్పటికీ ఇక సన్రైజర్స్ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. భారీ ధర పెట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్లు తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉన్నారు. ఇలా ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్లో ఏకంగా 13 కోట్లు పెట్టి ఒక ఇంగ్లాండ్ యువ ఆటగాడిని కొనుగోలు చేసింది సన్రైజర్స్.

 అతను ఎవరో కాదు హరి బ్రూక్. ఏకంగా మంచి ఫామ్ లో ఉండడంతో అతని బ్యాటింగ్ విధ్వంసం సన్రైజర్స్ కు బాగా కలిసి వస్తుంది అని అనుకుంది. కానీ ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ లో అతను ఒక్క సెంచరీ మినహా మిగతా ఏ మ్యాచ్ లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అతనికి వెచ్చించిన 13 కోట్లకు ఎక్కడ న్యాయం చేయలేకపోయాడు. దీంతో అతన్ని రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది సన్రైజర్స్. ఇక ఇప్పుడు అతను ఏకంగా మెరుపు ఇన్నింగ్స్ ఆడి సన్రైజర్స్ కు షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఇంగ్లాండ్ జట్టు ఐదు మ్యాచ్ల టి20  సిరీస్ లో.. ఇంగ్లాండ్ తొలి రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

 అయితే కీలకమైన మూడో మ్యాచ్లో మాత్రం అదరగొట్టింది ఇంగ్లాండ్. ఈ మ్యాచ్ లో హరి బ్రూక్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. చివరి ఓవర్ కు 21 పరుగులు కావాల్సిన దశలో.. బ్రూక్ ఏడు బంతుల్లోనే 31 పరుగులు చేసి ఇంగ్లాండ్ సిరీస్ ఆశలను సజీవంగా ఉంచాడు. ఇలా మరోసారి తన ఫామ్ లోకి వచ్చాడు అన్న విషయాన్ని నిరూపించాడు హరి బ్రూక్. అయితే అతన్ని సన్రైజర్స్ చివరికి వేలంలోకి వదిలేసి తప్పు చేసింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: