రోహిత్ ఎఫెక్ట్.. చెన్నై ఫస్ట్.. లక్నో లాస్ట్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఆ జట్టుకు అయిదు సార్లు ఐపీఎల్ ఐపీఎల్ టైటిల్ అందించి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను అర్ధాంతరంగా సారధ్య బాధ్యతలు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. అయితే ఐపీఎల్ లో ఉన్న మిగతా టీమ్స్ అన్నీ కూడా రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ మాకు కూడా ఉంటే ఎంత బాగుండు అని కోరుకుంటున్న వేళ.. అటు ముంబై ఇండియన్స్ మాత్రం కెప్టెన్ గా ఉన్న రోహిత్ ను తొలగించడం అందరిని అవ్వాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి  


 అయితే ఇలా ఏకంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ అభిమానులు మాత్రం అస్సలు జీవించుకోలేకపోతున్నారు. రోహిత్ కెప్టెన్గా లేని ముంబై ఇండియన్స్ జట్టును ఊహించుకోలేము అంటూ అభిప్రాయపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇక ముంబై ఇండియన్స్ ని అన్ ఫాలో చేస్తున్న అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. అయితే కెప్టెన్సీ మార్పు నిర్ణయం ముందు వరకు కూడా అటు ముంబై ఇండియన్స్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి 13.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.


 కానీ రోహిత్ ను కెప్టెన్ గా తొలగించిన తర్వాత 1 1 మిలియన్ మందిని కోల్పోయింది ముంబై ఇండియన్స్. దీంతో మరో ఛాంపియన్ టీం అయినా చెన్నై 13.1 మిలియన్ ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉంది. కాని తర్వాత ముంబై ఇండియన్స్ 12.2 మంది ఫాలోవర్స్, బెంగళూరు 11.7 మంది ఫాలోవర్స్, కోల్కతా నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్స్,ఢిల్లీ క్యాపిటల్స్ 3.5 మిలియన్లు, గుజరాత్ 3.5 మిలియన్లు, రాజస్థాన్ రాయల్స్ 3.3 మిలియన్లు, సన్రైజర్స్ 3.2 మిలియన్లు, పంజాబ్ మూడు మిలియన్లు, లక్నో 2.9 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను ఇంస్టాగ్రామ్ లో కలిగి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: