ఐపీఎల్ హిస్టరీ లోనే అత్యధిక ధర.. అతనికి రూ. 20.50 కోట్లు?
అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అతని కోసం ఎన్నో ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉందని.. క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇక అతనికి రికార్డు స్థాయి ధర పలుకుతుందని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఐపీఎల్ హిస్టరీలోనే అతను రికార్డ్స్ స్థాయి ధరను సొంతం చేసుకున్నాడు. ఏకంగా అతని ఎలాగైనా సొంతం చేసుకోవాలని. ప్రణాళికలను సిద్ధం చేసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అతని కోసం భారీ ధరను పెట్టింది.
ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ గా కొనసాగుతున్న ప్యాట్ కమిన్స్ ను ఏకంగా 20.5 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకుంది. కేవలం రెండు కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన కమిన్స్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి సన్రైజర్స్ జట్టు 20.5 కోట్ల రూపాయలకు అతని జట్టులోకి తీసుకుంది అని చెప్పాలి. కాగా గతంలో కమిన్స్ కోల్కతా జట్టు తరఫున ఆడాడు అయితే ఇప్పుడు వరకు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర గత ఏడాది శ్యామ్ కరణ్ కు దక్కిన 18.5 కోట్లే ఉండగా.. ఇక ఈ రికార్డు ఇప్పుడు బద్దలు కొట్టేశాడు కమిన్స్.