వారెవ్వా.. సన్రైజర్స్ జట్టులోకి వరల్డ్ కప్ హీరో?
ఇక ప్రతి సీజన్లో కొత్త కెప్టెన్ నియమిస్తూ సన్రైజర్స్ ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. కానీ ఎంతమంది ప్లేయర్లను మార్చిన కూడా సన్రైజర్స్ జట్టుకి అస్సలు అదృష్టం కలిసి రావడం లేదు అని చెప్పాలి. దీంతో ప్రతి సీజన్లో కూడా ఈ జట్టు అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అయితే ఇక 2024 ఐపీఎల్ సీజన్ లో మాత్రం టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే నేడు జరగబోయే వేలంలో ఎంతో మంది స్టార్ ప్లేయర్లను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల సన్రైజర్స్ జట్టు యాజమాన్యం వరల్డ్ కప్ హీరోని జట్టులోకి తీసుకుంది అన్నది తెలుస్తోంది.
వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావీస్ హెడ్ ఇక ఫైనల్ మ్యాచ్లో అయితే భారత జట్టుపై సెంచరీ చేసి ఇండియా ఓటమిని శాసించాడు అని చెప్పాలి. అయితే అతనికి ఐపీఎల్ వేలంలో భారీ ధర పలుకుతుందని అందరూ అనుకోక అనుకున్నట్లే.. అతను భారీ ధరకు అమ్ముడుపోయాడు. రెండు కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన అతన్ని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 6.80 కోట్లకు దక్కించుకుంది. అయితే ఇతని దక్కించుకునేందుకు చెన్నై జట్టు చివరి వరకు ప్రయత్నించినప్పటికీ చివరికి సన్రైజర్స్ వెనక్కి తగ్గకుండా అతని కోసం భారీ మొత్తం వెచ్చించి జట్టులోకి తీసుకుంది అని చెప్పాలి.