అదృష్టం అంటే ఇతనిదే.. ఒక్క బాల్ వేస్తే రూ.7.36 లక్షలు?

praveen
ఇప్పటికే ఇండియాలో 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన హడావిడి మొదలైంది. ఇక అన్ని ఫ్రాంచైజీలు కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఐపీఎల్ ట్రేడింగ్ లో భాగంగా ఇప్పటికీ కొన్ని టీమ్స్ ఇతర టీమ్స్ లోని ఆటగాళ్ళను సంప్రదింపుల ద్వారా తమ జట్టులో చేర్చుకున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూసిన ఐపీఎల్ మినీ వేలం ఇటీవలే ముగిసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో ప్రేక్షకులు ఊహించిన దానికంటే సంచలనాలు నమోదయ్యాయి అని చెప్పాలి. సాధారణంగా ఇక వేలంలో స్టార్ ప్లేయర్లు ఉంటే వారికి భారీ ధర పలకడం కామన్. అయితే ఈసారి మాత్రం ఏకంగా ఐపీఎల్ హిస్టరీ లోనే ఎవరు ఊహించని విధంగా భారీ ధర పలికారు కొంతమంది ప్లేయర్లు.


 అయితే మొదట ఆస్ట్రేలియా కెప్టెన్గా కొనసాగుతున్న ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మిగతా టీమ్స్ తో పోటీపడి మరి 20.5 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్ హిస్టరీలో ఇదే భారీ దరగా నిలిచింది. కానీ ఈ విషయం గురించి అందరు చర్చించుకుంటున్న సమయంలోనే మరో సంచలనం నమోదయింది అని చెప్పాలి. ఏకంగా 24.75 కోట్లకు మరో ఆస్ట్రేలియా ప్లేయర్ భారీ ధర పలికాడు. అతను ఎవరో కాదు స్టార్క్. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని ఇంత మొత్తంలో భారీ ధర చెల్లించి దక్కించుకుంది.


 దీంతో ఇక ఈ విషయం గురించి ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఒక ఆటగాడి కోసం మరి ఇంత ఎక్కువ మొత్తంలో పెట్టడమేంటి గురు అని అందరూ ఆశ్చర్యం లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. అయితే వేలంలో 24.75 కోట్ల రూపాయలు దక్కించుకున్న స్టార్క్ వేసే ఒక్క బంతికి ఏడు లక్షల రూపాయల విలువ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే టోర్నీలో ప్రతి జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఆ లెక్కన స్టార్క్ కు ఒక్కో మ్యాచ్ కు నాలుగు ఓవర్లు వేసిన ఇక 1.76 కోట్లు ఆర్జిస్తాడు. ఇక ఒక మ్యాచ్లో నాలుగో ఓవర్లు వేస్తాడు కాబట్టి ఒక్క ఓవర్ కు 44.19 లక్షలు వస్తాయి. అంటే ఒక్క బంతికి ఏకంగా 7.36 లక్షలు అర్జిస్తాడు స్టార్క్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: