సన్రైజర్స్ కు కొత్త కెప్టెన్.. ఫేట్ మారుతుందా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రతి సీజన్లో కూడా టైటిల్ రేసులో అంతకందుకు వెనుకబడిపోతుంది అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో డేవిడ్ వార్నర్ సారథిగా ఉన్న సమయంలో ఏకంగా ఒక్కసారి టైటిల్ గెలిచి సంచలనమే సృష్టించింది. జట్టులో స్టార్ బ్యాట్స్మెన్లు లేకపోయినప్పటికీ ఇక డేవిడ్ వార్నర్ తన కెప్టెన్సీ నైపుణ్యంతో  జట్టుకు టైటిల్ అందించాడు. కానీ ఆ తర్వాత ఇక సన్రైజర్స్ టీంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఏకంగా జట్టును చాంపియన్గా నిలిపిన డేవిడ్ వార్నర్ ను పక్కన పెట్టేసిన సన్రైజర్స్ జట్టు యాజమాన్యం కెన్ విలియమ్సన్ కొత్త సారధిగా నియమించింది.


 ఆ తర్వాత అతన్ని కూడా తొలగించి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్కరమ్ కు సారధ్య బాధ్యతలను అప్పగించింది. అయితే ఇలా జట్టులోని ఆటగాళ్ళను మాత్రమే కాదు జట్టు కెప్టెన్ను కూడా మార్చినప్పటికీ.. సన్రైజర్స్ అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ప్రతి సీజన్లోనూ టైటిల్ వేటలో వెనుకబడిపోతూనే ఉంది. కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టలేక నిరాశ పరుస్తూ వస్తుంది అని చెప్పాలి. అయితే 2024 ఐపిఎల్ సీజన్లో మాత్రం కప్పు గెలవాలని పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరోసారి సన్రైజర్స్ జట్టులో కెప్టెన్సీ మార్పు ఉండబోతుందట.


 అయితే కెప్టెన్సీ మార్పు విషయం తెరమీదకి రావడానికి కారణం ఇటీవల వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ ను సన్రైజర్స్ 20.5 కోట్లు పెట్టి మరి కొనుగోలు చేయడమే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీతో పాటు వరల్డ్ కప్ టైటిల్ గెలిపించిన కెప్టెన్ గా కొనసాగుతున్నాడు కమిన్స్. ఇక అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. దీంతో మార్కరమ్ ను కెప్టెన్ గా తప్పించి కమిన్స్ చేతిలో సారధ్య బాధ్యతలు  పెట్టే అవకాశం ఉంది. అయితే ఇక ఈ విషయంపై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతుంది అన్నది తెలుస్తుంది. మరి కమిన్స్ సారథ్యంలో అయినా సన్రైజర్స్ కు టైటిల్ వరిస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: