గిల్ కి షాకిచ్చిన బాబర్.. మళ్లీ లాగేసుకున్నాడుగా?
అయితే గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా ఆటగాళ్లు ఐసిసి ర్యాంకింగ్స్ లో సత్తా చాటుతూ ఉన్నారు. మూడు ఫార్మాట్ లో కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ అదరగొడుతూ ఉన్నారు. అయితే t20 లలో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా సూర్య కుమార్ యాదవ్ ఉండగా.. ఇక వన్డేలలో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా టెస్టులలో బౌలర్, ఆల్ రౌండర్ లో జాబితాలో అశ్విన్ జడేజాలు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. అయితే ఇటీవలే మరోసారి ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకటించింది. కాగా సూర్య కుమార్ యాదవ్ మరోసారి తన అగ్రస్థానాన్ని పదిలంగానే ఉంచుకున్నాడు అని చెప్పాలి.
కానీ యంగ్ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ మాత్రం.. వన్డేలలో నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. ఇక ఇప్పుడు అతనికి షాక్ తగిలింది ఎందుకంటే మొన్నటికి మొన్న అగ్రస్థానాన్ని కోల్పోయిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ మళ్లీ తన స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 824 పాయింట్ల తో బాబర్ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు ఇక మొన్నటి వరకు తొలి స్థానంలో ఉన్న టీమిండియా బ్యాట్స్మెన్ గిల్ 810 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే పాయింట్లు తగ్గినప్పటికీ అటు విరాట్ కోహ్లీ మూడో స్థానంలోనే కొనసాగుతూ ఉండడం గమనార్హం. బౌలర్ల విభాగంలో కేశవ మహారాజ్ 715 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.