చెన్నైకి ఆడబోతున్న ముస్తఫిజర్.. ఒకప్పుడు ధోనితో గొడవపడ్డాడా?

praveen
ఇటీవలే దుబాయ్ వేదికగా జరిగిన 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కూడా జట్టులోకి కొత్త ఆటగాళ్ళను తీసుకున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి కొంతమంది ప్లేయర్లను టీం లో చేర్చుకుంది. ఇక ఇలా టీమ్ లోకి తీసుకున్న వారిలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిర్ రెహమాన్ కూడా ఉండడం గమనార్హం. ఏకంగా రెండు కోట్ల రూపాయలు వెచ్చించి మరి అతన్ని జట్టులో చేర్చుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే అతను 2024 ఐపీఎల్ సీజన్లో ధోని సారథ్యంలో ఆడబోతున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఈ బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. గతంలో మహేంద్ర సింగ్ ధోని,ముస్తాఫిజూర్ మధ్య ఒక వివాదం చోటుచేసుకుంది. 2017 లో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో ధోని, ముస్తాఫీజుర్ వద్ద గొడవ జరిగింది. మ్యాచ్లో సింగల్ తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. ఈ బంగ్లాదేశ్ బౌలర్ అనుకోకుండా పరిగెడుతున్న ధోనీకి  అడ్డు వచ్చాడు  దీంతో ధోని అతడికి పక్కకు తోసేసాడు.  తర్వాత వీరిద్దరి మధ్య వాగ్వాదం   చోటుచేసుకుంది. దీంతో మ్యాచ్ రిఫరీ వచ్చి గొడవని సర్దుమనిగేలా చేయడమే కాదు ఇక ఇద్దరి మ్యాచ్ ఫీజులో కోత కూడా విధించారు.


 ఇక అప్పట్లో ఇలా ధోని, ముస్తాఫిజూర్ మధ్య జరిగిన గొడవ కాస్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇలా ఒకప్పుడు ధోనితో గొడవ పడిన ప్లేయర్ ఇక ఇప్పుడు ధోని సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడబోతున్నాడు. దీంతో ఒకప్పటి ఘర్షణ నుంచి ఇక ఇప్పుడు ఒకే టీం కోసం కలిసి ఆడే వరకు అంటూ ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ అప్పటి గొడవ జరిగిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై ఇక 2024 ఐపీఎల్ లో ఎలా రాణిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: