దిగ్గజాల వల్ల కాలేదు.. సచిన్ రికార్డు బద్దలు కొట్టిన బంగ్లాదేశ్ బ్యాటర్?

praveen
వరల్డ్ క్రికెట్లో లెజెండ్ గా భారత క్రికెట్లో క్రికెట్ దేవుడిగా కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ కెరియర్లో సాధించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నాయి. కానీ సచిన్ సాధించిన రికార్డులు మాత్రం ఇంకా పదిలంగానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక నేటితరం క్రికెటర్లలో ఒక్క కోహ్లీ మినహా మిగతా ఎవరూ కూడా సచిన్ రికార్డుకు చేరువలో కూడా లేరు అనడంలో సందేహం లేదు. అయితే ఇక ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఇక సచిన్ సాధించిన కొన్ని రికార్డులను అప్పుడప్పుడు బద్దలు కొట్టడం చేస్తూ ఉంటారు.


 ఇలా ఎవరైనా సచిన్ రికార్డు బ్రేక్ చేశారు అంటే అధి కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు ఎంతో మంది లెజెండరీ క్రికెటర్స్ కు సైతం సాధ్యం కానీ ఒక రికార్డును ఇటీవలే బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ బద్దలు కొట్టాడు. ఏకంగా ఆసియా నుంచి వన్డేలలో న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు. బంగ్లాదేశ్ బాటర్ సౌమ్య సర్కార్ ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో సౌమ్య సర్కార్ 151 బంతుల్లో 169 పరుగులు చేసి చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు అని చెప్పాలి.


 2009లో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా క్రిస్ట్ చర్చ్ వేదికగా జరిగిన మ్యాచ్లో సచిన్ ఓ మ్యాచ్ లో 113 పరుగులు చేశాడు. ఆసియా ఖండం నుంచి వన్ డే లలో కివిస్ గడ్డపై ఇదే అత్యధిక స్కోరుగా ఇప్పటివరకు కొనసాగుతోంది. అయితే ఇటీవల 14 ఏళ్ల రికార్డును బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ బ్రేక్ చేశాడు. 151 బంతుల్లోనే ఏకంగా 22 బౌండరీలు రెండు సిక్సర్ల సహాయంతో 169 పరుగులు చేశాడు. అయితే ఇప్పటివరకు ఎంతోమంది లెజెండ్స్ ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన సాధ్యం కాలేదు. చివరికి బంగ్లాదేశ్ క్రికెటర్ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం. దీంతో అతనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: