ఐపీఎల్ ఫ్రాంచైజీలు పక్కన పెట్టాయి.. ఐసీసీ అగ్రస్థానం ఇచ్చింది?

praveen
ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడెప్పుడ అని ఎదురుచూసిన  ఐపీఎల్ మినీ ఆక్షన్ ఇటీవలే ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మినీ యాక్షన్ లో ఎంతోమంది ప్లేయర్లు రికార్డు స్థాయి ధర పలికారు. అదే సమయంలో ఇక ఫ్రాంచైజీలు అన్నీ కూడా కొంతమంది ప్లేయర్లను పూర్తిగా పక్కన పెట్టేసాయి. వారిని కొనుగోలు చేసినందుకు కొంచెం కూడా ఆసక్తిని కనపరచలేదు అని చెప్పాలి. అయితే ఇలా ఫ్రాంచైజీలు పూర్తిగా పక్కన పెట్టిన వారిలో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ రషీద్ కూడా ఉన్నాడు.


 టి20 ఫార్మాట్ లో ఇప్పటికే తాను బెస్ట్ స్పిన్నర్ అనే నిరూపించుకున్న ఇతని ఏ ఫ్రాంచైజీ  కూడా కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ఇటీవలే ఐపీఎల్లో ఫ్రాంచైజీలు  పట్టించుకోకుండా పక్కన పెట్టిన ఈ స్పిన్నర్ ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మాత్రం అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. ఇటీవల ఐసీసీ t20 ర్యాంకింగ్స్ విడుదల చేయగా.. ఇక ఈ ర్యాంకింగ్స్ లో అదిల్ రషీద్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే ఇంగ్లాండు నుంచి పొట్టి క్రికెట్లో ఇలా నెంబర్ వన్ బౌలర్ ర్యాంకును సంపాదించుకున్న రెండో స్పిన్నర్ గా నిలిచాడు అని చెప్పాలి.


 గతంలో గ్రేమ్ స్పాన్ మాత్రమే ఇంగ్లాండ్ తరఫున t20 లలో ఇక ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బౌలర్గా స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న రషీద్ వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్లలో కూడా ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతను ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, భారత యువ స్పిన్నర్ రవి బిష్ణయ్ లను వెనక్కి నెట్టి టాప్ లోకి వచ్చేసాడు. ఇక ఈ జాబితాలో హసరంగా, మహిష్ తీక్షన టాప్ ఫైవ్ లో బౌలర్ల లిస్టులో ఉన్నారు అని చెప్పాలి. ఇక బ్యాట్స్మెన్ లిస్టులో సూర్య కుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: