ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతోంది ముంబై ఇండియన్స్. ఏకంగా మిగతా టీమ్స్ అన్నిటితో పోల్చి చూస్తే  ఐదు సార్లు టైటిల్ అందుకని ఎక్కువసార్లు ఐపీఎల్ ట్రోఫీ సొంతం చేసుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది అన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో ఇక చాంపియన్ టీం గా అవతరించింది. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం ముంబై ఇండియన్స్ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను ఇటీవల సారధ్య బాధ్యతల  నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది జట్టు యాజమాన్యం.


 అయితే ఈ నిర్ణయంతో ముంబై ఇండియన్ ఫాన్స్ మాత్రమే కాదు సాధారణ క్రికెట్ ప్రేక్షకుల సైతం షాక్ లో మునిగిపోయారు. రోహిత్ లాంటి కెప్టెన్ ను అందరు కావాలనుకుంటుంటే ముంబై ఇండియన్స్ మాత్రం అతన్ని పక్కన పెట్టడం ఏంటి అని షాక్ లో మునిగిపోయాయి. ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇది మాత్రమే కాదు అటు ముంబై జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న బౌలర్ బుమ్రా, బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవులు కూడా టీం ను వీడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


 రోహిత్ తర్వాత తమకు కెప్టెన్సీ దక్కుతుందని ఇద్దరు అనుకున్నారని కానీ ఇక ముంబై  యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు   అప్పగించడంతో నిరాశతో ఇద్దరు టీం ని విడబోతున్నారంటూ ఒక టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మకండి. ప్రస్తుతం ఏ ఆటగాడు ముంబైని వీడటం లేదు. మేము మరెవరిని కొనుగోలు చేయడం లేదు  రోహిత్ కు చెప్పిన తర్వాత కెప్టెన్సీ నుంచి తొలగించాం. ఈ విషయంపై ఎలాంటి ఆందోళన చెందవద్దు అంటూ స్పష్టం చేసింది ముంబై ఫ్రాంచైజీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: