వేలం ముగిసినా.. ఇంకా ఫ్రాంచైజీలకు ఆ చాన్స్ ఉంది?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడ అని ఎదురుచూసిన 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం ప్రక్రియ ఇటీవల ముగిసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో ఏకంగా 10 ఫ్రాంచైజీలు 230.45 కోట్ల రూపాయలతో 72 మంది ఆటగాళ్ళను ఆయా టీమ్స్ లోకి తీసుకున్నాయి అని చెప్పాలి  ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్లేయర్లకు మునుపేన్నడు లేని విధంగా ఈసారి వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. ఏకంగా 24.75 కోట్లకు కోల్కతా జట్టు  స్టార్క్ ని సొంతం చేసుకుంటే.. 20.5 కోట్లకి ప్యాట్ కమీన్స్ ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది అని చెప్పాలి.


 అయితే పలువురు అన్ క్యాప్డ్ ప్లేయర్లకు కూడా ఈ వేలంలో కోట్లాది రూపాయల ధర పలకడం గమనార్హం. అయితే వేలంలో ఇలా ప్లాన్ ప్రకారం కీలక ఆటగాళ్ళను దక్కించుకోవడం ద్వారా ఇక అన్ని ఫ్రాంచైజీలు కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు వేలం పూర్తయినప్పటికీ కూడా ఇంకా తమ జట్టులోకి కొత్త ప్లేయర్లను తీసుకునే అవకాశం ఫ్రాంచైజీలకు అందుబాటులోనే ఉంది. ట్రేడ్ విండో ద్వారా తమ జట్టులో ఆటగాళ్ళను చేర్చుకోవచ్చు. స్వాప్ డీల్స్ లేదా ఆల్ నగదు ఒప్పందాలతో కూడా ప్లేయర్లను మార్చుకునేందుకు అవకాశం ఉంది అని చెప్పాలి.


 ఇక ఇటీవలే డిసెంబర్ 20వ తేదీన ట్రేడ్ విండో ఓపెన్ అయింది. 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి నెల రోజుల ముందు వరకు ఈ విండో తెరిచి ఉంటుంది. అయితే తమ జట్టులో ఇంకా ఆటగాళ్ళను చేర్చుకోవాలని ఫ్రాంచైజీలు ట్రేడ్ విండోను ఉపయోగించుకుని ఒప్పందాలు చేసుకోవచ్చు. అయితే మొన్నటికి మొన్న ట్రేడ్ విండో డీల్ తోనే హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్ జట్టును గుజరాత్ టైటాన్స్ నుంచి తమ టీం లో చేర్చుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ప్రారంభం అయ్యే సమయానికి ఇలా ట్రేడ్ విండో ద్వారా ఏదైనా ఫ్రాంచైజీ  తమ జట్టులోని ఆటగాళ్ళను ఇతర టీం లోని ఆటగాళ్ళతో స్వాప్ చేసుకుంటుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: