ఐపీఎల్ కెప్టెన్సీ గా ఉన్న వారి.. వయస్సు ఎంతో తెలుసా?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి చర్చించుకుంటున్నారు. మొన్నటికి వరకు ఐపీఎల్ ట్రేడింగ్ లో భాగంగా కొన్ని టీమ్స్ ఇతర టీమ్స్ లోని ఆటగాళ్ళను జట్టులో చేర్చుకున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక కొన్ని టీమ్స్ కి కొత్త కెప్టెన్లు కూడా మారిపోయారు. ఇక ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో ఎంతోమంది ప్లేయర్లు రికార్డులు స్థాయి ధర పలికారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి అందరూ చర్చించుకుంటూ ఉండడం గమనార్హం.


 అయితే ఈ ఐపీఎల్ సీజన్లో కొన్ని జట్లకు కొత్త కెప్టెన్లు కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే ఐపీఎల్ లో ఇక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన వారు ఇక ఎంత వయసులో ఉన్నారు అన్న విషయాలకు తెలుసుకోవడానికి కూడా అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక ఐపీఎల్ లో ఆయా టీమ్స్ కి కెప్టెన్ గా ఎంపికైన ఆటగాళ్ల గత రికార్డులు ఏంటి... ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న అనుభవం ఏంటి అని తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తూ ఉన్నారు.


 అయితే 2024 ఐపిఎల్ సీజన్లో కొత్తగా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన వారితోపాటు ఇక మునుపటి సీజన్ నుంచి కూడా కెప్టెన్ గా కొనసాగుతున్న వారి వయస్సు వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే ఇక 2024 ఐపీఎల్ సీసన్ లో కెప్టెన్సీ చేపట్టిన వారిలో అతిపిన్న వయస్కుడిగా గిల్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం గిల్ కు 24 ఏళ్లు కావడం గమనార్హం .  ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ రిషబ్ పంత్  26 ఏళ్ళు, కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్  29, ఏళ్ళు, రాజస్థాన్ కెప్టెన్ సంజు 29 ఏళ్లు, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్కరం 29, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 30, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 31, పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధామ 38, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డూప్లెసెస్ 39, ఇక చెన్నై కెప్టెన్ ధోని 42 ఏళ్ల వయస్సు తో ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: