ఆ సూపర్ హిట్ సీరియల్ కి.. నాని అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడా?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతూ ఉన్నారు నాచురల్ స్టార్ నాని. వాస్తవానికి ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలని వచ్చాడు నాని. ఇక ఎంతోమంది స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఎన్నో ఏళ్ల పాటు పనిచేశాడు. కానీ ఆ తర్వాత అష్టా చమ్మ సినిమాతో నటుడుగా ఎంట్రీ ఇచ్చి చివరికి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నాచురల్ స్టార్ గా మారిపోయాడు. ఏకంగా రాఘవేంద్రరావు, మణిరత్నం, కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్ల దగ్గర గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు నాని.


 ఇక ఈ విషయాన్ని ఎన్నోసార్లు తన సినిమా ఈవెంట్లలో కూడా అభిమానులతో పంచుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే తాను నటించిన అష్టా చమ్మ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఇటీవల హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నాడు నాని. ఇదిలా ఉంటే హీరో నాని గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడమే కాదు.. ఒక సూపర్ హిట్ సీరియల్ కి కూడా నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడట.


 అయితే నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఆ పాపులర్ సూపర్ హిట్ సీరియల్ ఏదో కాదు అప్పట్లో అందరిని కడుపుబ్బ నవ్వించిన అమృతం. ఈ సీరియల్ ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్ ధారావాహికగా కొనసాగుతూ ఉంది. ఇక ఎన్ని ఎపిసోడ్లు చూసిన కూడా ఇంకా చూడాలనిపిస్తుంది తప్ప ఎక్కడ బోర్ కొట్టదు. ఇప్పుడైతే కామెడీ షోలు వచ్చాయి. కానీ అప్పుడు అయితే కడుపుబ్బా నవ్వుకోవాలి అనుకునేవారు అమృతం సీరియల్ చూసేవారు. ఇక ఈ సీరియల్ ని గోపి కసిరెడ్డి డైరెక్షన్ చేయగా ఆయన దగ్గర నాని అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారట. దాదాపు పది ఎపిసోడ్ ల వరకు ఆయన దగ్గరే పని చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: