రోహిత్ శర్మ.. ఆ బలహీనతలను అధిగమించాడు : మంజ్రేకర్

praveen
ప్రస్తుతం భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఇక ఈ పర్యటనలో భాగంగా టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతుంది అని చెప్పాలి. ఇక ఇప్పటికే పరిమిత ఓవర్లో ఫార్మాట్లో సిరీస్ లని ముగించుకున్న టీమిండియా.. డిసెంబర్ 26వ తేదీ నుంచి కూడా టెస్టు సిరీస్ మొదలుపెట్టబోతుంది. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికా జట్టును ఓడించడం అంత సులువైన విషయం కాదు.. కానీ ప్రస్తుతం భారత ప్లేయర్లు అందరూ కూడా ఫుల్ ఫామ్ లో ఉండడంతో.. ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ లో ఏ ఆటగాడు ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలాంటి రివ్యూలు కాస్త ప్రస్తుతం హట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే గత కొంతకాలం నుంచి అటు టెస్ట్ ఫార్మాట్లో మ్యాచ్లు ఆడనీ టీమ్ ఇండియా ప్లేయర్లు ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ సిరీస్ లో ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇటీవల ఈ టెస్ట్ సిరీస్ గురించి స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 రోహిత్ శర్మ ఆట తీరు గురించి మాట్లాడాడు. లెఫ్ట్ ఆర్మ్ పైసర్ల బౌలింగ్లో బాగా ఆడలేడు అనే బలహీనతలను రోహిత్ శర్మ అధిగమించాడు అంటూ మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. మిచెల్ స్టార్క్, షాహిన్ ఆఫ్రిది బౌలింగ్లో అద్భుతంగా ఆడుతున్నాడు అంటూ కొనియాడాడు ఈ క్రికెట్ లెజెండ్  ప్రస్తుతం అతనోక అత్యుత్తమ టెస్టు ప్లేయర్గా కనిపిస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా గత ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు రోహిత్ శర్మ. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ లోను రోహిత్ రాణిస్తాడు అంటూ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: