టెస్ట్ సిరీస్ నుండి.. ఇషాన్ కిషన్ తప్పుకుంది అందుకేనా?

praveen
ప్రస్తుతం భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది. అక్కడ వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇక సిరీస్ లను ముగించుకున్న టీమిండియా.. డిసెంబర్ 26వ తేదీ నుంచి ఆతిధ్య సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు అటు భారత జట్టుకి ఊహించని షాకులు తగులుతూ ఉన్నాయి. జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న ప్లేయర్లు గాయం బారినపడి దూరమవుతున్నారు. ఇప్పటివరకు ఏకంగా ముగ్గురు ప్లేయర్లు టీమ్ ఇండియాకు దూరమయ్యారు.


 మహమ్మద్ షమి రుతురాజ్ కైక్వాడ్ ఇషాన్ కిషన్లు ప్రస్తుతం భారత జట్టుకు దూరమయ్యారు అన్న విషయం తెలిసిందే. అయితే షమీ చీలమండ గాయంతో దూరం కాగా ఋతురాజ్ చేతి వేలికి గాయం కావడంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇషాన్ కిషన్ మాత్రం వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి తప్పుకున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ఇక ఆ వ్యక్తిగత కారణాలు ఏంటి అన్న విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే మానసికంగా అలసిపోవడం కారణంగానే ఇషాన్ కిషన్ జట్టు నుంచి తప్పుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.


 ఇక ఈ విషయంపై ఇటీవలే క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. మానసికంగా చాలా అలసిపోయినట్లు ఇషాన్ కిషన్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లారట. క్రికెట్ నుంచి కాస్త విరామం కావాలని సెలెక్టర్లను రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. టెస్ట్ సిరీస్ నుంచి తప్పించాలని ఇక బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడట. అందుకు మేనేజ్మెంట్ కూడా అంగీకరించడం గమనార్హం. అయితే ఈ ఏడాది ఆడిన ప్రతి సిరీస్ లో కూడా ఇషాన్ కిషన్ భారత జట్టుతోనే ఉన్నాడు అనే విషయం తెలిసిందే. అయితే తుది జట్టులో మాత్రం ఎక్కువసార్లు అతను చోటు దక్కించుకోలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: