న్యూజిలాండ్ జట్టుపై.. బంగ్లాదేశ్ సంచలన విజయం?
అయితే క్రికెట్ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. ఊహించనీ రీతిలో మ్యాచ్ ఫలితాలు వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఫలితాలు కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా బలిలోకి దిగిన టీమ్స్ సైతం అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక ఇలా ఏదైనా చిన్న టీం సంచలన విజయం సాధించింది అంటే చాలు ఇక వరల్డ్ క్రికెట్లో అదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇటీవల పటిష్టమైన న్యూజిలాండ్ పై బంగ్లాదేశ్ జట్టు కూడా ఇలాంటి ఒక అద్వితీయమైన విజయాన్ని సాధించింది. దీంతో ఈ విజయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.
సాధారణంగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిందంటే తప్పకుండా న్యూజిలాండ్ విజయం సాధిస్తుందని అందరూ నమ్మకం పెట్టుకుంటారు. కానీ ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది కివీస్ జట్టు. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది బంగ్లాదేశ్. తొలిత బ్యాటింగ్ చేసిన కివిస్ కేవలం 98 పరుగులు మాత్రమే చేసింది. ఇక వన్డేల్లో బంగ్లాదేశ్ ఫై న్యూజిలాండ్ ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇక ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన బంగ్లా జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి.. 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. అయితే అప్పటికే వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచిన న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకోగా.. చివరి మ్యాచ్ లో గెలిచిన బంగ్లాదేశ్ పరువు నిలబెట్టుకుంది.