హార్దిక్ పాండ్యా అభిమానులకు.. అదిరిపోయే గుడ్ న్యూస్?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తరచూ వార్తల్లో  నిలుస్తూ ఉన్నాడు. ఇటీవల ఏకంగా ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం హార్దిక్ పాండ్యాను తమ టీం కొత్త కెప్టెన్ గా నియమించింది. ఐదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను పక్కన పెట్టేసింది ముంబై ఫ్రాంచైజీ. ఈ క్రమంలోనే 2024 ఐపీఎల్ సీజర్ నుంచి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ముంబై జట్టును ముందుకు నడిపించబోతున్నాడు.


 అయితే అటు హార్దిక్ పాండ్యా 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభ సమయానికి అందుబాటులోకి వస్తాడా లేదా అనే విషయంపై మాత్రం అనుమానాలు నెలకొన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయం బారిన పడ్డాడు హార్దిక్ పాండ్య. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇక వరల్డ్ కప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కి మాత్రమే కాదు ఇక ప్రపంచక ముగిసిన తర్వాత భారత జట్టు ఆడుతున్న ద్వైపాక్షిక సిరీస్ లకి కూడా అతను అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు హార్దిక్ పాండ్యా.


 దీంతో ఇక 2024 ఐపీఎల్ సీజన్ నాటికి అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇక ఐపీఎల్ ప్రారంభం నాటికి అతను ఫిట్ గా ఉంటాడని తెలుస్తుంది. కాలి గాయం నుంచి హార్దిక్ పాండ్యా వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం. అయితే ఐపీఎల్ 2024 సీజన్ మార్చి నెలలో ప్రారంభం కానుంది. ఇక అప్పుడు వరకు హార్దిక్ పాండ్య పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తాడట. హార్దిక్ అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోతున్నారు. కెప్టెన్గా అతను ముంబై ఇండియన్స్ ని ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలని ఉంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: