టార్గెట్ 2024 వరల్డ్ కప్.. ఇంగ్లాండ్ కోచ్ గా పొలార్డ్?
ఈ క్రమంలోనే ఆయా దేశాలలో ఉండే క్రికెట్ పిచ్ లపై ఎలా రాణించాలి అనే విషయంపై పక్కా ప్లాన్ తో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి అన్ని టీమ్స్. అయితే ఇటీవల కాలంలో ఏదైనా జట్టు విదేశాలలో మ్యాచులు ఆడుతుంది అంటే చాలు అక్కడి పిచ్ లపై అనుభవం ఉన్న ఆటగాళ్ళను సిబ్బందిగా చేర్చుకోవడం లాంటివి చేస్తూ ఉంది. అయితే ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ వెస్టిండీస్ యుఎస్ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నిలో ఇంగ్లాండ్ జట్టు ఎంత అధ్వానంగా ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
లీగ్ దశ నుంచి టోర్నీ నుంచి నిష్క్రమించి చివరికి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా భారీ అంచనాలతో వచ్చిన.. ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే టి20 వరల్డ్ కప్ లో మాత్రం ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతుంది. ఈ క్రమంలోనే వెస్టిండీస్ పిచ్ లపై అవగాహన పెంచుకునేందుకు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ పోలార్డును కన్సల్టెంట్ కోచ్ గా నియమించుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. వెస్టిండీస్ ప్లేయింగ్ కండిషన్స్ తెలిసిన వ్యక్తి అయితే బాగుంటుందని ఇక ఇలాంటి నిర్ణయం తీసుకుందట ఇలాంటి క్రికెట్ బోర్డు దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.