యువతి ప్రేమించలేదని.. యువకుడు చేసిన పనికి అందరూ షాక్?
ప్రేమించడం అందరి హక్కు. అయితే ఆ ప్రేమను వ్యక్తపరిచినప్పుడు ఎదుట వ్యక్తి ఒప్పుకుంటారా లేదా అన్నది మాత్రం మన చేతుల్లో ఉండదు. ఒప్పుకుంటే ప్రేమను కొనసాగించడం ఒప్పుకోకపోతే మళ్లీ సరికొత్తగా జీవితాన్ని ప్రారంభించడం చేయాలి. కానీ ఇటీవల కాలంలో ఇక ప్రేమించిన వారు ప్రేమను అంగీకరించలేదు అంటే చాలు.. చావు ఒకటే శరణ్యం అన్న విధంగా ఆలోచిస్తున్నారు నేటి రోజుల్లో యువత. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. యువతి ప్రేమను అంగీకరించకపోవడంతో చివరికి యువకుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇక బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన సిద్దిపేట జిల్లా గ్రామీణ మండలం లో వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి కొండపాక మండలం సిరిసినగండ్లకు చెందిన సురేష్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఈ నెల 21వ తేదీన చిన్నాన్న వెంకటయ్య కు సురేష్ ఫోన్ చేశాడు. ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇక ఆమెకు నా ప్రేమను చెబితే అంగీకరించ లేదు. ఎంతో బాధగా ఉంది. బతకాలని లేదు అంటూ చెప్పి పురుగుల మందు తాగాడు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన తో తల్లి దండ్రులకు కడుపు కోతె మిగిలింది. దీంతో అరణ్య రోజున విలపించారు తల్లిదండ్రులు.