అదేంటి నేనెలా ఔట్ అయ్యాను.. కన్ఫ్యూజన్లో పడ్డ బాబర్?
ఇలా పాకిస్తాన్ ఆటగాళ్లు ఏదో ఒక విచిత్రమైన అనుభవంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం కూడా ఇలాగే వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం అటు ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఇక ఇటీవల మొదటి టెస్ట్ మ్యాచ్ ముగియగా.. ఆస్ట్రేలియా పట్టు బిగిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం కి ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. తొలి ఇన్నింగ్స్ లో నాలుగవ స్థానంలో బరిలోకి దిగాడు బాబర్ ఆజాం.
ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు మాత్రమే చేశాడు. అయితే అప్పటికే పాకిస్తాన్ కు కీలకమైన వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో బాబర్ జట్టును ఆదుకుంటాడు అని అందరూ అనుకున్నారు. అలాంటి సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ వేసిన అద్భుతమైన ఇన్ స్వింగర్ కు బాబర్ పెవిలియన్ చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఫ్ సైడ్ పడిన బంతి టర్న్ అవుతూ బాబర్ బ్యాట్, ప్యాడ్ మధ్య ఉన్న ఖాళీ నుంచి వెళ్లి బేయిల్స్ ని పడగొట్టేసింది. దీన్ని చూసిన బాబర్ తెల్ల మొహం వేశాడు. అసలు అతను ఎలా అవుట్ అయ్యాను అనేది అర్థం కాక కన్ఫ్యూజన్లో అక్కడే అయోమయంలో నిలబడిపోయాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.