ఈ టైంలో.. టీమిండియాలో ఆ ఇద్దరు ఉంటే ఎంత బాగుండేదో?
అందుకే మిగతా ఫార్మాట్లతో పోల్చి చూస్తే భిన్నంగా ఉండే అటు టెస్ట్ ఫార్మాట్లో చాలామంది ఆటగాళ్లు పెద్దగా సక్సెస్ కాలేరు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఎన్నో మెరుపులు మెరిపించి సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయి భారీ ఇన్నింగ్స్ లు ఆడే ప్లేయర్లు సైతం ఇక అటు టెస్ట్ ఫార్మాట్లో చెత్త ప్రదర్శనలు చేసి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందుకే ఎవరైనా టెస్ట్ ఫార్మాట్లో బాగా ఆడారు అంటే చాలు వారిని టెస్ట్ స్పెషల్ లిస్టు బ్యాట్ మెన్లు అని పిలుస్తూ ఉంటారు. కాగా ప్రస్తుతం భారత జట్టులో ఇలాంటి టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ల కొరత స్పష్టంగా తెలుస్తుంది.
సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా ఆతిథ్య సఫారీ జట్టుతో టెస్టు సిరీస్ ఆగుతుంది భారత జట్టు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో చెత్త ప్రదర్శన చేసింది. 31 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాజ్యాన్ని చవిచూసింది భారత జట్టు. రెండు ఇన్నింగ్స్ లలో కూడా విఫలం అయింది అని చెప్పాలి. రెండు ఇన్నింగ్స్ లలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా కేవలం 55 పరుగులు మాత్రమే చేశారు. దీంతో సీనియర్లు టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు అయినా పూజార, రహానే లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తుంది అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయపడుతున్నారు. విదేశీ పిచ్ లపై అద్భుతంగా ఆడే రహానే అనుభవం జట్టుకు ఉపయోగపడేది అంటూ అభిప్రాయపడుతున్నారు.