టీమిండియా ఓడినా.. కోహ్లీ మాత్రం చరిత్ర సృష్టించాడు?
అయితే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా కొత్తగా జట్టులోకి వచ్చి ఏదో నిరూపించుకోవాలి అనే ఆటగాడిలో కనిపించే కసి విరాట్ కోహ్లీలో ప్రతి మ్యాచ్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. నేటితరం క్రికెటర్లతో పోల్చి చూస్తే ఎవరికి సాధ్యం కానన్ని పరుగులు చేసినప్పటికీ ఇంకా పరుగుల దాహం తీరలేదు అన్నట్లుగా ప్రతి మ్యాచ్ లోనూ చెలరేగిపోతూ ఉంటాడు. ఇకపోతే సౌత్ ఆఫ్రికా తో ఇటీవల జరిగిన టెస్ట్ సందర్భంగా రన్ మిషన్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఒక క్యాలెండర్ ఇయర్ లో అన్ని ఫార్మట్లలో కలిపి 2000 పరుగులను పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు విరాట్ కోహ్లీ. దీంతో మొత్తం ఏడు క్యాలెండర్ ఇయర్స్ లో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా రికార్డులకు ఎక్కాడు. 2012లో 2186 పరుగులు, 2014లో 2286, 2016లో 2005, 2017 లో 2088 .. 2018లో 2735 పరుగులు, 2019లో 2045 పరుగులు, 2023లో అన్ని ఫార్మాట్లలో కలిపి 2000 పరుగులు సాధించి ఈ అరుదైన రికార్డును సృష్టించాడు విరాట్ కోహ్లీ.