కేఎల్ రాహుల్.. ఇక నువ్వేం మాట్లాడొద్దు : కైఫ్

praveen
గత కొంతకాలం నుంచి వరుస విజయాలతో దూసుకు పోతున్న టీమ్ ఇండియాకు ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఘోర పరాభవం ఎదురయింది అన్న విషయం తెలిసిందే. ఊహించని రీతిలో ఏకంగా 31 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓటమిని చవిచూసింది భారత జట్టు. ఈ క్రమంలోనే ఇక అటు భారత జట్టు ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి.


 కీలకమైన టెస్టు సిరీస్ లో అటు భారత జట్టు కనీస ప్రదర్శన చేయలేక పోయింది అంటూ అందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. టీమిండియా ఇలా చేతులెత్తేస్తుంది అని అస్సలు ఊహించలేదు అంటూ అభిమానులు సైతం సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఓటమితో అటు భారత జట్టు అత్యంత దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొని చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది అని చెప్పాలి. అయితే ఇక అటు భారత జట్టు ఓడిపోయినప్పటికీ.. కే.ఎల్ రాహుల్ ప్రదర్శన మాత్రం అందరిని ఆకట్టుకుంది.


 ఏకంగా సెంచరీ తో చెలరేగి పోయిన కేఎల్ రాహుల్ తన తన ఆట తీరుతో భారత జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడం లో సక్సెస్ అయ్యాడు. ఒకవైపు సహచర బ్యాట్స్మెన్లు అందరూ కూడా వికెట్ కోల్పోతుంటే అతను మాత్రం క్రీజులో పాతుకు పోయాడు. ఈ క్రమం లోనే అతనిపై ప్రశంసలు వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యం లోనే టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. అత్యంత కష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చి సెంచరీ చేయడం చిన్న విషయం కాదు. విదేశాల్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలంటే ఎంతో సహనం ఉండాలి. కేఎల్ రాహుల్ ఇక నువ్వు మాట్లాడొద్దు. నీ బ్యాటే మాట్లాడుతుంది. నీ ఇన్నింగ్స్ చిరస్మరణీయం అంటూ మహమ్మద్ కైఫ్ ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: