టెస్ట్ ఫార్మాట్లో.. భారత జట్టు చెత్త రికార్డు?

praveen
ప్రస్తుతం భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో వరుసగా ద్వైపాక్షక సిరీస్ లు ఆడుతుంది టీమిండియా. కాగా ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ అటు భారత జట్టుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా ఉన్న అన్ని జట్లను కూడా వారి సొంత గడ్డ మీద ఓడించి సిరీస్ ను కైవసం చేసుకుంది భారత జట్టు. ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికాని మాత్రం వారి సొంత గడ్డమీద ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. టెస్ట్ సిరీస్ ను దక్కించుకోలేకపోయింది.


 ఈ క్రమంలోనే దశాబ్దాల నిరీక్షణకు అటు భారత జట్టు తెరదించుతుంది అని అభిమానులు అందరూ కూడా భావించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా తప్పకుండా సిరీస్ ను కైవసం చేసుకుంటుంది అని భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించనీ రీతిలో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురయింది అని చెప్పాలి. ఏకంగా సఫారీ గడ్డపై ఇటీవలే జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురయింది. ఏకంగా 31 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది భారత జట్టు. ఈ క్రమంలోనే భారత జట్టు పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి.


 అయితే సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన భారత జట్టు ఒక చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. సఫారీ గడ్డపై అత్యంత భారీ ఓటమిని చవిచూసింది భారత జట్టు. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్ లో భారత్ ఇన్నింగ్స్ సహా 31 పరుగుల తేడాతో ఓడిపోవడం మొదటిసారి. గతంలో 2010 డిసెంబర్లో ఇన్నింగ్స్ 25 పరుగులు సహా ఇన్నింగ్స్ తేడాతో భారత జట్టు ఓడిపోయి చెత్త రికార్డింగ్ సృష్టించగా.. ఇక ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టింది అని చెప్పాలి. ఇక రెండో టెస్టు జనవరి మూడవ తేదీన ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: