KKR ప్లేయర్ విధ్వంసం.. 50 బంతుల్లోనే సెంచరీ?

praveen
టి20 ఫార్మాట్ అంటేనే అటు బ్యాట్స్మెన్ ల విధ్వంసానికి మారుపేరు అనే విషయం తెలిసిందే. ఎందుకంటే టి20 ఫార్మాట్ లొ ఆడే ప్రతి బ్యాట్స్మెన్ కూడా అతి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సిన టార్గెట్ ఉంటుంది. ఈ క్రమంలోనే రావడం రావటమే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోవాలి అనే మైండ్ సెట్ తో మైదానం లోకి బరిలోకి దిగుతూ ఉంటాడు. ఇక అనుకున్నదే తడువుగా చెలరేగిపోతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇలా బ్యాటింగ్ ని చూసి అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారు. కాగా ఎవరైనా క్రికెటర్ ఇక ఇలాంటి విధ్వంసాన్ని కొనసాగించి అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు అంటే చాలు ఇక అతని గురించి సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల  ఇలాంటి ఒక మెరుపు సెంచరీ నమోదు అయింది. ఏకంగా ఆఫ్గనిస్తాన్ ఆటగాడు 50 బంతుల్లోనే వీరబాదుడు బాది శతకం సాధించాడు. దీంతో అతని ఇన్నింగ్స్ గురించి ప్రస్తుతం అందరూ కూడా చర్చించుకుంటున్నారు.


 ఇటీవల యూఏఈ తో జరుగుతున్న టి20 సిరీస్లో ఆఫ్గనిస్తాన్ ఓపెనర్ రహమతుల్లా గూర్భాజ్ విద్వంసం సృష్టించాడు. ఏకంగా యూఏఈ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 50 బంతుల్లోనే ఏడు సిక్సర్లు ఏడు ఫోర్ల సహాయంతో సెంచరీ మార్కు అందుకున్నాడు. అయితే అతనికి టి20 ఫార్మాట్లో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం.  మరో బ్యాట్స్మెన్ ఇబ్రహీం జాద్రాన్ సైతం 43 బంతుల్లో 59 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విరోచితమైన ఇన్నింగ్స్ లతో ఆఫ్గనిస్తాన్  భారీగా పరుగులు చేసింది అని చెప్పాలి. కాగా రహమతుల్లా గుర్బాజ్ అటు ఐపిఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: