రాజమౌళి వల్లే డ్రాప్ అయ్యా.. లేదంటే ఆ మూవీ తీసేవాడిని : ప్రశాంత్ వర్మ
ఏకంగా అతి తక్కువ బడ్జెట్లో ప్రశాంత్ వర్మ విఎఫ్ఎక్స్ ఉపయోగించిన విధానం.. ఆయన టేకింగ్ కథ కథనం ఇలా అన్ని కూడా ప్రేక్షకులను ఫిదా చేసేసాయ్. అయితే ఇక ఈ మూవీ ఈ సంక్రాంతికి సూపర్ హిట్ సాధించడం ఖాయం అన్నది తెలుస్తోంది. కాగా ఇటీవల ప్రమోషన్స్ లో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన మూవీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. మహాభారతం సినిమా తీయాలని గతంలో అన్నారు అంటూ ప్రశ్నించగా.. అవును అనుకున్నాను. కానీ ఇక రాజమౌళి గారు తీస్తున్నారు అనగానే నేను డ్రాప్ అయ్యాను అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.
అయితే అవెంజర్స్ తరహాలో ఇక మన ఇండియన్ సాంప్రదాయంలోని ఎంతో మంది సూపర్ హీరోలకు సంబంధించిన కథలు తన దగ్గర ఉన్నాయని.. ఇక హనుమాన్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి ఇక ఆ కథలతో మిగతా సినిమాలు తీయాలా వద్దా అని ఆలోచిస్తాను అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. ఇక మీ సినిమాలో దైవభక్తి అంశం ఉంటుంది ఎందుకు అంటూ ప్రశ్నిస్తే.. అది మన సాంప్రదాయం, దేవుడు భక్తిఅనేది మనలో ఇమిడిపోయాయి. హనుమాన్ లో కూడా ఒక సామాన్యుడు భయస్తుడు హనుమంతుడు సహకారంతో ఏ స్థాయికి వెళ్ళాడు అన్నదే చూపించాం అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.