వార్నీ.. క్రికెట్లో ఇలాంటిది జరిగి ఎన్ని రోజులైందో?

praveen
ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ ఎందుకో క్రీడాభిమానులు అందరూ కూడా క్రికెట్ ను అమితంగా అభిమానిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా టీవీకి అతుక్కుపోతూ ఉంటారు. ఇక చాలామంది క్రికెట్ ప్రేక్షకులు స్టేడియం కు తరలివెళ్లి ఇక ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక క్రికెటర్లను ఏకంగా ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు.


 అయితే తమ అభిమాన క్రికెటర్లను జీవితంలో ఒక్కసారి కలిసిన చాలు అని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు ఆయా ఆటగాళ్ల అభిమానులు. ఈ క్రమంలోనే కలిసే ఛాన్స్ వచ్చింది అంటే ఆనందానికి అవధులు ఉండవు. కొంతమంది ఏకంగా తమ అభిమాన క్రికెటర్లను కలిసేందుకు రిస్క్ చేయడానికి కూడా సిద్ధమైపోతూ ఉంటారు. ఇండియా వేదికగా ఏదైనా మ్యాచ్ జరిగింది అంటే చాలు భారీకేడ్లను సెక్యూరిటీని దాటుకొని వెళ్లి మరి ఇక మైదానంలోకి దూసుకుపోయి తమ అభిమాన క్రికెటర్లను కలవడం లాంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నో సార్లు జరిగాయి.


 అయితే గత కొంతకాలం నుంచి ఇక ఇలాంటి ఘటనలు పెద్దగా తెర మీదకి రావడం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో టి20 మ్యాచ్లో మాత్రం మరోసారి ఇలాంటి ఘటన జరిగింది. ఏకంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని కలిసేందుకు ఒక అభిమాని మైదానం లోకి దూసుకు వచ్చాడు. బౌండరీ లైన్ వద్ద నిలబడిన కోహ్లీ  కోసం గ్రౌండ్లోకి దూసుకొచ్చిన అతను విరాట్ కోహ్లీని హగ్ చేసుకున్నాడు. ఆఫ్గనిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా 18 ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా అభిమాని దూసుకు రావడంతో కాస్త గందరగోళం నెలకొంది  తర్వాత ఇక సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: