అతన్ని ధోనితో పోల్చడమేంటి.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు?
అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఛాన్స్ వచ్చినప్పుడు జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి కూడా తన బ్యాట్ తో ఆదుకుంటున్నాడు. ఇక రింకు సింగ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు అంటే చాలు బౌలర్ల వెన్నులో వణుకు పుట్టే విధంగా వీర విహారం చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. దీంతో టీమ్ ఇండియాకు రింకు సింగ్ నయా ఫినిషర్ అంటూ ఎంతోమంది అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి భారత జట్టును వేధిస్తున్న ఫినిషర్ పాత్రకు ఇన్నాళ్లకు సరైన ఆటగాడు దొరికాడు అంటూ ఇక ప్రశంసిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇక ధోనిని చూసే తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అంటూ రింకు చెప్పడంతో అతన్ని కొంతమంది ధోనితో పోల్చడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రింకు సింగ్ ని ధోనితో పోల్చలేం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని ఒక లెజెండ్. అయితే ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన రింకుని ధోనితో పోల్చలేం. రింకు కూడా మైదానంలో ఎంతో కూల్ గా ఉంటూ విధ్వంసం సృష్టిస్తున్నాడు. అతని నిలకడైన ఆట తీరుతో భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.