ఇంగ్లాండ్ టీమ్.. ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా?

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ గా కొనసాగుతున్న రెండు జట్ల మధ్య సమరం జరిగితే.. ఇక ఆ పోరు పైనే అందరి దృష్టి ఉంటుంది. ఇక రేపటి నుంచి ఇంగ్లాండ్  టీమిండియా మధ్య ప్రారంభం కాబోయే టెస్టు సిరీస్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది అని చెప్పాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో ముందుకు వెళ్లాలంటే ఇరు జట్లు కుడా ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించడం ఎంతో కీలకం. అయితే సొంత గడ్డపై భారత జట్టును ఓడించడం ఎంతో కష్టతరమైన పని. అదే సమయంలో బజ్ బాల్ అనే ఎటాకింగ్ గేమ్ తో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెడుతుంది ఇంగ్లాండ్ జట్టు. దీంతో ఇక ఆ టీం ని కూడా తక్కువ అంచనా వేయలేం.

 ఈ క్రమంలోనే ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం అన్నది తెలుస్తుంది. మొత్తంగా ఈ సిరీస్ లో భాగంగా ఐదు మ్యాచ్లలో ఇంగ్లాండ్ టీమిండియా  తలబడబోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే భారత్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లలో అటు ఇంగ్లాండ్ జట్టు తమ ఆట తీరుతో ఎంతవరకు ప్రభావం చూపించగలదు అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు.

 అయితే భారత్, ఇంగ్లాండ్ మధ్య రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మొదటి టెస్ట్ జరగబోతుంది అని చెప్పాలి. కాగా భారత్ ఆతిథ్యంలో ఆడిన చివరి రెండు టెస్టు సిరీస్ లను ఇంగ్లాండు కోల్పోయింది. ప్రస్తుతం బెన్ స్టోక్స్ సేన టెస్టుల్లో బజ్ బాల్ అనే ఎటాకింగ్ గేమ్ వ్యూహాన్ని అనుసరిస్తుంది. దీంతో భారత్తో జరగబోయే మ్యాచ్లో ఇదే వ్యూహంతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అయితే 12 ఏళ్లుగా స్వదేశంలో టెస్ట్ సిరీస్ ను కోల్పోని భారత జట్టు రికార్డ్ ను ఇంగ్లాండు బ్రేక్ చేస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: