వామ్మో.. సానియా మీర్జాకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయా?
ఇంటర్నెట్ జనాలు అందరూ మాట్లాడుకున్నట్లుగానే సానియా మీర్జా ఏకంగా తన భర్త షోయబ్ మాలిక్ కు విడాకులు ఇచ్చేసింది. 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికింది. భర్త షోయన్ మాలిక్ ఇటీవల మూడో పెళ్లి చేసుకోవడంతో ప్రతి ఒక్కరికి ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. పాకిస్తాన్ హీరోయిన్ సనా జావెద్ ను మూడో వివాహం చేసుకున్నాడు షోయబ్. సనా జావిద్ తో ఎఫైర్ కారణంగానే సానియా మీర్జా భర్తతో విడిపోయింది అన్న వార్తలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలోనే సానియా మీర్జా పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు నేటిజన్స్ తెగ ఆసక్తిని చూపిస్తున్నారు. సానియా మీర్జా ఆస్తులకు సంబంధించిన వార్త కూడా వైరల్ గా మారింది. 1999లో టెన్నిస్ ప్లేయర్ గా కెరియర్ ప్రారంభించిన సానియా మీర్జా ఆస్తులను గట్టిగానే కూడా పెట్టుకుందట. ఏకంగా 2023 నాటికి ఆమె నికర సంపద 26 మిలియన్ డాలర్లట. ఇది భారత కరెన్సీలో దాదాపు 210 కోట్లకు సమానం అనేది తెలుస్తుంది. టెన్నిస్ ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు వ్యాపార ప్రకటనల ద్వారా సానియా అర్జీంచిన ఆదాయమే ఎక్కువట. ఏకంగా అప్పట్లో ఒక్కో ప్రకటనకి 75 లక్షల నుంచి కోటి వరకు సానియా మీర్జా వసూలు చేసేదట. ప్రస్తుతం ఎండార్స్మెంట్ ద్వారానే ఏడాదికి 25 కోట్లు సంపాదిస్తుందట సానియా.