జడేజా కావాలనే రనౌట్ అయ్యేలా చేశాడా.. సర్ఫరాజ్ ఏమన్నాడంటే?

praveen
ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇటీవలే సర్ఫరాజ్ ఖాన్ అనే ఒక దేశవాళి విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ టీమిండియాలోకి అరంగేట్రం చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు అని చెప్పాలి. ఇక అతని కంటే తక్కువగా దేశవాళీ క్రికెట్లో రాణించిన క్రికెటర్లకు ఎప్పుడో ఛాన్సులు ఇచ్చిన సెలెక్టర్లు సర్ఫరాజ్ ఖాన్ కి మాత్రం కాస్త లేటుగానే భారత జట్టులోకి పిలుపును అందించారు. అయితే లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చాను అన్న విధంగానే అతని ప్రదర్శన తీరు సాగుతూ ఉంది. ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో అతను భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు.

 ఇక మొదటి మ్యాచ్ లోనే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ సూపర్ సెంచరీ చేసేలాగే కనిపించాడు. కానీ ఊహించని రీతిలో రవీంద్ర జడేజా కారణంగా రన్ అవుట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ సర్ఫరాజ్ ఖాన్ ఉన్న ఫామ్ చూస్తే ఎంతో అలవోకగా సెంచరీ చేయడం ఖాయమని అభిమానులు కూడా భావించారు. కానీ ఊహించని రీతిలో జడేజా కారణంగా రన్ అవుట్ అయ్యి ఇక హాఫ్ సెంచరీ తోనే అతను అరంగేట్రం మ్యాచ్లో సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే జడేజా కారణంగా ఇలా సర్ఫరాజ్ ఖాన్ రనౌత్ కావడంతో డగవుట్ లో కూర్చున్న కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఆగ్రహంతో తన క్యాప్ ను నేలకేసి విసిరి కొట్టిన వీడియో కూడా వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 అయితే కావాలనే రవీంద్ర జడేజా సర్ఫరాజ్ ఖాన్ ను రనౌట్ చేశాడా ఏంటి అనే చర్చ కూడా తెరమీదకి వచ్చింది. ఇక ఇదే ప్రశ్న అటు సర్పరాజ్ కు ఎదరవగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటలో ఇది భాగమే. క్రికెట్లో ఇలాంటి మిస్ కమ్యూనికేషన్ జరగడం సహజమే. ఒక్కోసారి రన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇలా రన్ అవుట్ అవుతూ ఉంటాం. నా ఇన్నింగ్స్ చివరి వరకు జడేజా ఎంతో సపోర్ట్ చేశారు అంటూ సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ రన్ అవుట్ తర్వాత జడేజా ఏకంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సర్పరాజ్ కి  క్షమాపణలు చెప్పాడు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: