టెస్టుల్లో 500 వికెట్లు.. అశ్విన్ బొమ్మతో రూ. 500 కరెన్సీ నోటు?
ఇక ఇప్పుడు ఇలాంటి మీమ్ ఒకటి సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూ ఉంది. ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. తన స్పిన్ బౌలింగ్ తో ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో కూడా అశ్విన్ తన ప్రదర్శనతో జట్టు విజయాలలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు. అయితే ఇటీవల మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీయడం ద్వారా టెస్ట్ ఫార్మాట్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే అశ్విన్ ప్రతిభ పైన అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. కాగా ఇక ఇటీవల అశ్విన్ టెస్ట్ ఫార్మట్ లో 500 వికెట్లు సాధించిన నేపథ్యంలో.. మీమర్స్ కూడా తమ క్రియేటివిటీకి పని పెట్టారు. ఈ క్రమంలోనే కొన్ని ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా అశ్విన్ బొమ్మ వేసి 500 కరెన్సీ నోటు విడుదల చేశారు అన్నట్లుగా మీమ్ తయారు చేసి ఇంటర్నెట్లో వదిలారు మీమర్స్. గాంధీ ఫొటో స్థానంలో అశ్విన్ ఫోటో ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇక దాన్ని షేర్ చేస్తూ అశ్విన్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక మీమ్ చూసి నెటిజన్స్ అందరూ కూడా తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి.