వామ్మో.. ఒక్క బౌలరే.. 18,371 పరుగులు ఇచ్చాడు?

praveen
సాదరణంగా ఫాస్ట్ బౌలర్లకి కెరియర్ కాలం తక్కువగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. కానీ ఇదంతా ఒట్టి మాటలే అనే నిరూపించాడు ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్. 40 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఇక మూడు ఫార్మాట్లలో కూడా ఇంగ్లాండ్ జట్టులో కీలక ప్లేయర్గా వ్యవహరిస్తూ తన బౌలింగ్ తో ప్రత్యర్థులను భయపెడుతూనే ఉన్నాడు. యువ ఆటగాళ్ళను సైతం తలదన్నే విధంగా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి.


 అయితే ఇప్పుడు టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ జరుగుతుండగా.. ఈ టెస్ట్ సిరీస్ లో కూడా ఇక ఇంగ్లాండ్ జట్టులో కీలక ప్లేయర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు జేమ్స్ అండర్సన్. అయితే ఇటీవల ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్న జేమ్స్ అండర్సన్.. ఇక చెత్త రికార్డును మూటగట్టుకుని వార్తల్లో నిలిచాడు. ఏకంగా టెస్ట్ క్రికెట్ హిస్టరీలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా ఒక అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు జేమ్స్ అండర్సన్. 185 మ్యాచ్లలో 18371 పరుగులు ఇచ్చాడు. ఇలా అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లలో మొదటి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి.


 అయితే మొన్నటి వరకు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. 2008లో రిటైర్ అయిన అనిల్ కుంబ్లే 132 టెస్ట్ మ్యాచ్ లలో 18,355 పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అయితే ఇప్పుడు జేమ్స్ అండర్సన్ ఈ రికార్డును బద్దలు కొట్టి అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం ఇంగ్లాండు, ఇండియా జట్ల మధ్య రాజ్కోట్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఈ చెత్త రికార్డు అతని ఖాతాలో చేరిపోయింది. తర్వాత స్థానాలలో ముత్తయ్య మురళీధరన్ 130 మ్యాచ్లలో 18,180,  షైన్ వార్న్ 145 మ్యాచ్లలో 17955పరుగులు,  స్టువర్టు బ్రాడ్ 167 మ్యాచ్ లలో 16,719 పరుగులను సమర్పించుకుని ఈ లిస్టులో తర్వాత స్థానాలలో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: