టీమిండియా కెప్టెన్ చనిపోతే.. ఇదేనా మీరిచ్చే గౌరవం.. గవాస్కర్ షాకింగ్ కామెంట్స్?

praveen
సాధారణంగా భారత క్రికెట్ లో ఎన్నో ఏళ్లపాటు సేవలందించిన ఆటగాడు ఒకవేళ వృద్ధాప్యంలో మరణిస్తే ఇక అతను భారత క్రికెట్కు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం టీం లో ఉన్న ఆటగాళ్లందరూ కూడా నివాలి అర్పించడం చేస్తూ ఉంటారు. ఇక బీసీసీఐ కూడా ఇలా నివాళి అర్పిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఎవరైనా దివంగత ఆటగాడికి నివాళి అర్పించాలి అనుకున్నప్పుడు ఏకంగా చేతికి నల్ల బ్యాడ్జీలు కట్టుకొని బరిలోకి దిగుతూ ఉంటారు ప్లేయర్లు. అయితే ఇక ఇటీవల రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆట సందర్భంగా.. భారత ప్లేయర్లు అందరూ కూడా నల్ల బ్యాడ్జీలను చేతికి కట్టుకొని  సంతాపం తెలియజేశారు.

 అయితే ఇలా నివాళి అర్పించడానికి కారణం ఒకప్పుడు భారత జట్టును కెప్టెన్ గా ముందుకు నడిపించిన దత్తాజీ రావు గైక్వాడ్ కన్నుమూయడమే. 95 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ ఫిబ్రవరి 13వ తేదీన కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు దత్తాజీరావు గైక్వాడ్ భారత క్రికెట్కు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అయితే ఇక ఇటీవలే మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత ఆటగాళ్లు కూడా నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నివాళులు అర్పించారు. అయితే ఇలా ఆయన మరణించిన నాలుగు రోజుల తర్వాత భారత ఆటగాళ్లు సంతాపం తెలపడంపై టీమిండియా లెజెండరి క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 దత్తాజీ రావు గైక్వాడ్ ఒక భారత జట్టు మాజీ కెప్టెన్.  జట్టు మేనేజ్మెంట్ మొదటిరోజు ఆటలోనే ఆయనకు నివాళులు అర్పించి ఉంటే బాగుండేది అంటూ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. గైక్వాడ్ ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల సిరీస్ లొ భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. ఆయన ఉన్నా లేకపోయినా గౌరవించాల్సిన అవసరం మనకు ఉంది. ఆయన మృతి పట్ల మొదటి రోజు ఆటలోనే సంతాపం వ్యక్తం చేయాల్సింది. అయితే ఇక ఇలా ఆట మూడో రోజు తీసుకున్న నిర్ణయాన్ని ముందు రోజు ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కావట్లేదు  ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత ఆలస్యం జరగలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు సునీల్ గవాస్కర్. రాజ్కోట్ టెస్ట్ కి కామెంటెటర్ గా వ్యవహరిస్తున్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: