భార్యని లావుగా ఉన్నావన్న భర్త.. ఆమె ఏం చేసిందో తెలుసా?

praveen
భార్యాభర్తల బంధం అనేది అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒక్కసారి పెళ్లి అనే బంధంతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఒకరికి ఒకరు తోడునీడగా జీవితాన్ని సాగించాలి. ఇక ఎన్ని కష్టాలు వచ్చినా బంధాన్ని తెంచుకునేందుకు మాత్రం అస్సలు ప్రయత్నించకూడదు. ఇక ఏదైనా సమస్య వచ్చినప్పుడు సర్దుకుపోతూ జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. కానీ ఇక ఇప్పుడు వైవాహిక బంధంలో మాత్రం ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పాలి.
 చిన్నచిన్న మనస్పర్ధలతోనే చివరికి పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. చిన్నచిన్న కారణాలతోనే చివరికి ఎంతోమంది కోర్టు మెట్లు ఎక్కుతూ విడాకులు తీసుకుంటున్నారు. ఇక మరికొన్ని ఘటనల్లో అయితే ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హతమారుస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమానురాగాలను చూపించుకోవలసిన భార్యాభర్తలు.. ఏకంగా ఒకరి లోపాలను ఒకరు ఎత్తిచూపుతూ హేళన చేసుకుంటూ తరచు గొడవ పడుతున్నారు. దీంతో ఇలాంటి వాటి కారణంగా ఎంతో మంది చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా భార్యను ప్రేమగా చూసుకోవాల్సిన భర్త భార్య లావుగా ఉండడంతో ఇదే కారణంగా చూపిస్తూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇక భర్త వేధింపులతో విసిగిపోయిన మహిళ సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది. 2016లో అస్లాం - తెహ్నియాకు వివాహం జరిగింది. అయితే వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇటీవల అస్లాం  తన భార్యను పుట్టింట్లో వదిలేసి వెల్లగా.. ఆమె బలవన్మరణానికి పాల్పడింది. అయితే తల్లి రజియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అస్లాంను అరెస్టు చేసి విచారిస్తున్నారు. తమ అల్లుడు కారణంగానే కూతురు చనిపోయిందని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని రజియా పోలీసులను కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: