మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డుల్లో.. రవీంద్ర జడేజా రికార్డ్?
ఇలా క్రికెట్ లోని మూడు విభాగాల్లో కూడా రవీంద్ర జడేజా తనకు తిరుగులేదు అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి ఫుల్ ఫామ్ లో ఉన్న జడేజా అన్ని ఫార్మాట్లలో కూడా టీమిండియా జట్టులో కీలక పాత్ర వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు భారత జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుండగా.. ఈ టెస్ట్ సిరీస్ లో కూడా వికెట్లు వరుసగా పడగొడుతూ జట్టు విజయాలలో తనవంతు పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఇక ఇటీవల రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో కూడా రవీంద్ర జడేజా ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. బంతితో మ్యాజిక్ చేయడమే కాదు బ్యాట్ తో విధ్వంసం కూడా సృష్టించాడు.
వరుసగా సెంచరీలతో చెలరేగిపోయాడు. అయితే ఇటీవలే మూడో టెస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం ద్వారా క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో భారత్ వేదికగా జరిగిన మ్యాచ్లలో ఎక్కువగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు జడేజా తొమ్మిది అవార్డులను అందుకున్నాడు. గతంలో అనిల్ కుంబ్లే అందుకున్న 9 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డును సమం చేశాడు. ఇక వీరి తర్వాత లిస్టులో కోహ్లీ ఎనిమిది, సచిన్ ఎనిమిది, అశ్విన్ ఆరు, హర్భజన్ ఆరు, జవగల్ శ్రీనాథ్ ఆరుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకుని తర్వాత స్థానంలో ఉన్నారు.