
మొన్నే అరంగేట్రం చేశాడు.. అంతలోనే రిటైర్మెంట్?
అయితే సాధారణంగా కొంతమంది ప్లేయర్లకు పాతికేళ్ల వయసు కూడా నిండక ముందే అంతర్జాతీయ క్రికెట్లో ఛాన్స్ దక్కుతూ ఉంటారు. ఇలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఎంతోమంది అదరగొడుతూ ఉంటారు అని చెప్పాలి ఇంకొంతమంది ప్లేయర్లకు మాత్రం ఏకంగా 30 ప్లస్ వయసు దాటిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లపాటు మాత్రమే కెరియర్ను కొనసాగించి చివరికి రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఒక ప్లేయర్ ఇలాంటిదే చేసాడు. కొన్ని రోజుల కిందటే జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇక అంతలోనే చివరికి రిటైర్మెంట్ ప్రకటించాడు.
అతను ఎవరో కాదు.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ నూర్ అలీ జాద్రాన్. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. అన్ని ఫార్మాట్ల నుంచి కూడా వీడ్కోలు పలుకుతున్నాను అంటూ తెలిపాడు. అయితే ఆఫ్గనిస్తాన్ తరఫున వన్డే ఫార్మాట్లో తొలి బంతి ఆడిన క్రికెటర్ గా నూర్ అలీ జాద్రాన్ రికార్డు సృష్టించాడు. కాగా అతను ఇప్పటివరకు రెండు టెస్టులు 51 వన్డేలు 23 t20 మ్యాచ్ లు ఆడాడు. అన్ని ఫార్మాట్ లో కలిపి 2786 పరుగులు చేశాడు. ఇటీవలే తన మేనల్లుడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అయినా ఇబ్రహీం జాద్రాన్ చేతుల మీదుగా క్యాప్ అందుకుని టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసాడు. కానీ అంతలోనే చివరికి రిటైర్మెంట్ ప్రకటించాడు.