ఒళ్ళు గగుర్పొడిచే వీడియో.. మొసలిని తినేసిన మరో మొసలి?

praveen
ఈ భూమ్మీద ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవులలో మొసళ్ళు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా అడవికి రారాజు సింహమని చెబుతూ ఉంటారు. అడవిలో ఉండే ప్రతి జంతువు పైన సింహం ఆదిపత్యం చెలాయిస్తుంది అని అంటూ ఉంటారు.  అయితే ఇలా అడవికి రారాజు అయిన సింహాన్ని సైతం నీటిలో ఉంటే వణికిస్తూ ఉంటుంది మొసలి. ఏకంగా సింహాన్ని ఆహారంగా మార్చుకోగల బలాన్ని కలిగి ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 ఇక మొసలి నీటిలో ఉన్నప్పుడు ఏదైనా జంతువు దాని నోటికి చిక్కింది అంటే చాలు ఇక ఆ జంతువుకు అదే చివరి రోజు అవుతుంది. అయితే మొసలి వేట ఎంత ప్రమాదకరంగా భయంకరంగా ఉంటుంది అన్నదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ గా మారిపోతూనే ఉంటాయి అని చెప్పాలి. ఇలాంటివి చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వరకు ఎన్నోసార్లు వివిధ రకాల జంతువులని మొసలి భయంకరంగా వేటాడి తినడం చూసాము. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది మాత్రం మరింత భయంకరమైన వేట గురించి అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా ఒక మొసలిని మరో మొసలి దారుణంగా చంపి తినేసింది.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒక పెద్ద ఆకారం కలిగిన మొసలి చిన్న మొసలి పిల్లను తన నోటితో పట్టుకుంది. ఇక ఆ చిన్న మొసలి తప్పించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది. దీంతో పెద్ద మొసలి ఆ చిన్న మొసలిని చాలా బలంగా నేలకేసి కొట్టింది. ఇక దీంతో చివరికి చిన్న ముసలి ప్రాణాలు విడిచింది. ఇక ఆ తర్వాత ఆ చిన్న మొసలిని నోట కరచుకొని ఇక అమాంతం మింగేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది పెద్ద మొసలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: