హార్దిక్ టైటిల్ గెలిస్తే.. రోహిత్, ధోనీకి సాధ్యం కానీ రికార్డ్?
ఇదిలా ఉంటే ఇక ఎప్పుడు ఛాంపియన్ టీం అయినా ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగేందుకు సిద్దమవుతుంది. అయితే ఇప్పటికే గుజరాత్ కెప్టెన్గా తన సత్తా ఏంటో చూపించిన హార్దిక్ పాండ్యా ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ ని ఎలా ముందుకు నడిపించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక అప్పటికే జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించిన రోహిత్ ను.. హార్దిక్ తన కెప్టెన్సీ తో మరిపించగలడా అనే విషయం కూడా చర్చంగా మారింది. ఇకపోతే హార్దిక్ పాండ్యా 2024 ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు టైటిల్ అందించాడు అంటే ఏకంగా ధోని, రోహిత్ లకు సాధించలేని ఒక అరుదైన రికార్డు సృష్టించబోతున్నారు.
రోహిత్, ధోనీలు ఇప్పటివరకు ఒక ఫ్రాంచైజీకి బోలెడన్ని ట్రోఫీలు సాధించి పెట్టారు. కానీ హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో ముంబై జట్టుకు ట్రోఫీ అందిస్తే 2 ఫ్రాంచైజీలకు వేరువేరు సమయాలలో ట్రోఫీలు అందించిన కెప్టెన్గా ఐపీఎల్ హిస్టరీలోనే కొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా మొదటి ప్రయత్నంలోనే ఆ జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు హార్దిక్. ఇక ఇప్పుడు ముంబై కెప్టెన్ గా కూడా టైటిల్ అందిస్తే రెండు ఫ్రాంచైజీల తరఫున టైటిల్ అందించిన కెప్టెన్గా కొనసాగుతాడు. అయితే ఇప్పుడు వరకు ఐపీఎల్లో ఆటగాళ్లుగా రెండు జట్టు టైటిల్స్ గెలవడంలో భాగమయ్యారు. కానీ కెప్టెన్లుగా ఏ ప్లేయర్ కూడా రెండు ఫ్రాంచైజీలకు టైటిల్ అందించలేదు.