ఐపీఎల్ హిస్టరీలో.. తొలి మ్యాచ్ తొలి బంతికే సిక్సర్ కొట్టింది వీళ్లే?
మరీ ముఖ్యంగా ఇక అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలి అనుకునే యువ ఆటగాళ్లకి ఐపీఎల్ అనేది ఒక మంచి వేదికగా మారిపోయింది. అయితే ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త ప్లేయర్లు ఐపీఎల్ లోకి వస్తూ ఉంటారు. ఐపీఎల్ లో బాగా రానించి ఇక జాతీయ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంటూ ఉంటారు. అయితే ఐపీఎల్లో ఆడిన డెబ్యూ మ్యాచ్ లో కొంతమంది ప్లేయర్లు తడబాటుకు గురవ్వడం.. చూస్తూ ఉంటాం. కానీ ఇంకొంతమంది మాత్రం అదరగొడుతూ ఉంటారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాట్స్మెన్ సమీర్ రిజ్వి ఇటీవల ipl లోకి అరంగేట్రం చేసాడు. తన డెబ్యూ మ్యాచ్ లోనే అరుదైన రికార్డుసృష్టించాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ కొట్టాడు.
ఈ క్రమంలోనే ఐపిఎల్ హిస్టరీలో ఇప్పటివరకు తొలి మ్యాచ్ లో తొలి బంతికే సిక్సర్ కొట్టిన ఆటగాళ్ళు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు 9 మంది క్రికెటర్లు మాత్రమే ఇలా డెబ్యూ మ్యాచ్లో తొలి బంతికే సిక్సర్ కొట్టారు. ఇటీవల చెన్నై బ్యాటర్ సైతం ఇలాగే సిక్స్ కొట్టి వీరి సరసన నిలిచాడు. ఇంతకుముందు రాబిన్ కిన్వి (ఆర్ ఆర్), కెఒన్ కూపర్ (ఆర్ ఆర్} రసేల్ (కేకేఆర్) కార్లోస్ బ్రాత్ వైట్ (DD), అనికేత్ చౌదరి (ఆర్ సి బి), జీవస్ సీర్లేస్ (కేకేఆర్), మహిష్ తీక్షన (csk) సిద్ధిష్ లాడ్ (ఎమ్ఐ) తరఫున ఆడిన తొలి మ్యాచ్ తొలి బంతికే సిక్సర్ కొట్టి రికార్డు చేశారు.